Chandrababu: మోదీ రాక సందర్భంగా ఒకటిన నిరసన తెలపండి: ప్రజలకు చంద్రబాబు పిలుపు

  • శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చిన సీఎం
  • విభజన గాయంపై కారం పూసేందుకు వస్తున్నారు
  • మోదీ సభను ప్రజలు బహిష్కరించాలని పిలుపు
విభజన హామీలను విస్మరించి రాష్ట్రాభివృద్ధికి మోకాలడ్డుతున్న ప్రధాని మోదీ సభను ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించి శాంతియుత నిరసన తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. విభజన గాయంపై కారం పూసేందుకు మోదీ వస్తున్నారా? అని ప్రశ్నించారు. జనవరి 1న బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొనాలని కోరారు. మోదీ సభకు హాజరుకాకుండా గుణపాఠం చెప్పాలన్నారు. కేవలం పార్టీ కార్యక్రమానికి రావడమే మోదీ రాజకీయమని చెప్పారు. మోదీ పర్యటనపై జగన్‌, పవన్‌ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. గురువారం జరగనున్న కడప స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Chandrababu
Narendra Modi

More Telugu News