nagarjuna: భగవంతుడిగా నాగార్జున ఎలా ఉంటాడా అనే ఆసక్తి పెరిగింది: పరుచూరి గోపాలకృష్ణ

  • నాగార్జునను బాబాగా చూసి ఆశ్చర్యపోయాను 
  • బాబానే నడిచొస్తున్నట్టుగా అనిపించింది 
  • ఆయన ఆ పాత్రలో జీవించారు      
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో 'శిరిడీసాయి' సినిమాను గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. ఈ రోజున శిరిడీసాయి చిత్రపటాన్ని చూడగానే, నాకు 'శిరిడీసాయి' సినిమా గుర్తుకు వచ్చింది. అప్పటి అనుభూతిని మీతో పంచుకోవాలనిపించింది. నాగార్జునను 'అన్నమయ్య'గా .. 'శ్రీరామదాసు'గా చూశాను. అవి భక్తుల పాత్రలు .. కానీ 'శిరిడీసాయి'లో నాగార్జున చేసింది భగవంతుడి పాత్ర.

అందువలన శిరిడీసాయిగా ఆయన ఎలా ఉంటారా అనే ఆసక్తి నాలో మొదలైంది. కానీ ఫస్టు డే బాబా గెటప్ వేసుకుని ఆయన సెట్లోకి రాగానే, సాక్షాత్తు సాయిబాబా నడిచొస్తున్నట్టుగానే అనిపించింది. అలా ఆయన వంకే చూస్తుండిపోయాను. ఈ సినిమాలోని కీలకమైన సన్నివేశాలలో ఆయన అద్భుతంగా జీవించారు. నడకలోను .. డైలాగ్ డెలివరీలోను .. ఎక్స్ ప్రెషన్స్ లోను ఆ పాత్రలో నాగార్జున కనపడకుండా ఆయన చేశారు. భగవంతుడి పాత్రలోకి ఆయన అద్భుతంగా ప్రవేశించి మెప్పించారు" అని అన్నారు.
nagarjuna
paruchuri

More Telugu News