Ramcharan: మహేశ్ బాబుతో కలసి చర్చ్ కి వెళ్లిన రామ్ చరణ్... ఫొటోలు వైరల్!

  • తరచూ కలుసుకునే టాలీవుడ్ హీరోలు
  • క్రిస్మస్ సందర్భంగా కలిసిన కుటుంబాలు
  • వైరల్ అవుతున్న ఫొటోలు
టాలీవుడ్ సూపర్ హీరోలు మహేశ్ బాబు, రామ్ చరణ్ లు మరోసారి కలుసుకున్నారు. పర్వదినాలు, స్పెషల్ అకేషన్స్ లో కలుసుకునే వీరిద్దరూ మంగళవారం నాడు క్రిస్మస్ సందర్భంగా కలిశారు. మహేష్ తన భార్య నమ్రత, కుమార్తె సితారలతో వస్తే, రామ్ చరణ్ తన శ్రీమతి ఉపాసనతో కలసి వచ్చారు.

 వీరు ఓ చర్చ్ ని సందర్శించి, అక్కడ జరుగుతున్న ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాసన, సితారలు ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. వీరు తీసుకున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని టాలీవుడ్ ప్రముఖ పీఆర్ఓ బీఏ రాజు తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ ఫొటోలను మీరూ చూడవచ్చు.



Ramcharan
Mahesh Babu
Christmas
Festival

More Telugu News