Single Male: చిన్నారి ఉంటే... ఒంటరి పురుషుడికి ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవు!

  • తొలి 365 రోజులూ పూర్తి వేతనం
  • ఆపై 730 రోజుల పాటు సగం వేతనం
  • నోటిఫికేషన్ జారీ చేసిన కార్మిక మంత్రిత్వ శాఖ
ఏదైనా దురదృష్టకరమైన ఘటన జరిగి, తన బిడ్డను చూసుకునేందుకు భార్య లేకుంటే, పురుషుడికి వేతనంతో కూడిన సెలవు లభించనుంది. ఈ మేరకు నరేంద్ర మోదీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. బిడ్డ ఆలనాపాలనా చూసుకునే తండ్రికి తొలి 365 రోజుల పాటు 100 శాతం వేతనంతో కూడిన సెలవు లభించనుంది.

ఆపై కూడా సెలవు కావాలని భావిస్తే, తదుపరి 730 రోజులకూ సగం వేతనం లభిస్తుంది. 7వ వేతన సంఘం చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ వెలువరించింది. ఇప్పటివరకూ ఈ సౌలభ్యం స్త్రీలకు మాత్రమే అందుబాటులో ఉందన్న సంగతి తెలిసిందే.
Single Male
Child
Infant
Leave
Salary

More Telugu News