modi: కార్యకర్తలు అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతున్నారు: మోదీపై రాహుల్ సెటైర్

  • మోదీపై విరుచుకుపడిన రాహుల్ 
  • ఇక మీడియా సమావేశాలు ఏం నిర్వహిస్తారు
  • మధ్య తరగతి ప్రజల కష్టాలు పట్టవా?
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బూత్ స్థాయి కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు కూడా మోదీ సమాధానం చెప్పే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి మీడియా సమావేశాలను ఎలా నిర్వహించగలుగుతారని ప్రశ్నించారు. మధ్య తరగతి ప్రజల నుంచి పన్నులు వసూలు  చేయడంపై ఉన్న శ్రద్ధ... వారి సంక్షేమంపై లేదా? అని ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు మోదీ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని అన్నారు. మధ్య తరగతి ప్రజల కష్టాలపై సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం ఏమిటని ప్రశ్నించారు.  
modi
Rahul Gandhi
congress
bjp

More Telugu News