varun tej: కండలు పెంచుతోన్న మెగా హీరో

  • దర్శకుడిగా కిరణ్ కొర్రపాటి
  • నిర్మాతగా అల్లు బాబీ 
  • సంగీత దర్శకుడిగా కాలభైరవ    
మొదటి నుంచి కూడా వరుణ్ తేజ్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అలా ప్రేక్షకుల ముందుకు 'కంచె'.. 'అంతరిక్షం' సినిమాలను తీసుకొచ్చిన ఆయన, తన తదుపరి సినిమాలో బాక్సర్ గా కనిపించనున్నాడు. వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాను కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చేయనున్నాడు. ఇంతకుముందు ఈ కుర్రాడు 'మిస్టర్' .. 'తొలిప్రేమ' సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.

ఈ సమయంలోనే వరుణ్ తేజ్ తో సాన్నిహిత్యం ఏర్పడింది. దాంతో ఆయనకి ఒక మంచి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఈ కథలోనే వరుణ్ తేజ్ ను బాక్సర్ గా చూపించనున్నాడు. అందుకు అవసరమైన కసరత్తు చేస్తూ వరుణ్ తేజ్ కండలు పెంచే పనిలో వున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ ఈ సినిమాతో నిర్మాతగా, కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగాను పరిచయమవుతున్నారు. 
varun tej

More Telugu News