Chiranjeevi: ‘మెగా’ కుటుంబంలో ఆనందం.. మరోసారి తాత అయిన చిరంజీవి!

  •   శ్రీజ- కల్యాణ్ దేవ్ దంపతులకు ఆడశిశువు జననం
  • 2018 క్రిస్మస్ నా జీవితాంతం గుర్తుండి పోతుంది
  • ఈరోజు ఉదయం మాకు అమ్మాయి జన్మించింది- కల్యాణ్ దేవ్
మెగాస్టార్ చిరంజీవి మరోమారు తాతయ్య అయ్యారు. చిరంజీవి కుమార్తె శ్రీజ- కల్యాణ్ దేవ్ దంపతులకు పండంటి ఆడశిశువు జన్మించింది. ఈ విషయాన్ని కల్యాణ్ దేవ్ ఓ పోస్ట్ ద్వారా తెలిపాడు. 2018 క్రిస్మస్ తన జీవితాంతం గుర్తుండి పోతుందని, ఈరోజు ఉదయం తమకు అమ్మాయి జన్మించిందని, మీ అందరికీ సూపర్ మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కల్యాణ్ దేవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ తో పాటు పాప పాద ముద్ర ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. కాగా, ‘మెగా’ కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.

Chiranjeevi
megastar
srija
kalyandev
baby girl

More Telugu News