Nelanshi Patel: 5.7 అడుగుల కురులతో కేశ సుందరి... గిన్నిస్ బుక్ లో భారత యువతి!

  • గుజరాత్ టీనేజర్ నీలాన్షీ పటేల్
  • పదేళ్ల నుంచి కురులపై మక్కువ
  • తల్లి మద్దతుతో సమస్యలు లేవన్న నీలాన్షి
ప్రపంచంలోనే అత్యంత పొడవైన కురులను కలిగివున్న టీనేజర్ గా గుజరాత్ కు చెందిన 16 ఏళ్ల యువతి నీలాన్షీ పటేల్ గిన్నిస్ రికార్డుకు ఎక్కింది. ఈమెకు 5.7 అడుగుల పొడవైన కురులున్నాయి. కురులపై ఉన్న ఇష్టంతో తన ఆరో ఏట నుంచే జుట్టును కత్తిరించకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నానని చెబుతోంది నీలాన్షి.  

ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు తాను ఓసారి హెయిర్ కట్ చేయించుకున్నానని, అప్పుడు తనకు చాలా ఇబ్బందిగా అనిపించడంతో అప్పటి నుంచి మళ్లీ ఆ పని చేయలేదని చెప్పిన నీలాన్షి, ఇప్పుడు ప్రతిష్ఠాత్మక గిన్నిస్ రికార్డు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని అంటోంది.

కాగా, నీలాన్షి కురులను నిటారుగా కొలిస్తే, 67 అంగుళాల పొడవు తేలింది. తాను వారానికి ఒకసారి తలంటి స్నానం చేస్తానని, ఆ తరువాత జుట్టును ఆరబెట్టుకునేందుకు గంటన్నర సమయం పడుతుందని, దువ్వేందుకు మరో గంట సమయం పడుతుందని, తన తల్లి ఇచ్చే మద్దతుతోనే ఇంత పొడవైన కురులున్నా సమస్యలు లేకుండా ఉన్నానని వెల్లడించింది.
Nelanshi Patel
Hair
Longest
Gunnis
Gujarath

More Telugu News