maa: 'మా' డైరీని విడుదల చేసిన కృష్ణ, విజయనిర్మల

  • మా-2019 డైరీ విడుదల
  • కృష్ణ, కృష్ణంరాజు దంపతులకు ఘన సన్మానం
  • 33 మందికి రూ. 5 వేల చొప్పున పింఛన్ అందిస్తామన్న 'మా'
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్-2019 డైరీని సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల దంపతులు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు దంపతులు, జయసుధ, సీనియర్ నరేష్, పరుచూరి గోపాలకృష్ణలతో పాటు 'మా' కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ.... అసోసియేషన్ తరపున జనవరి నుంచి 33 మందికి రూ. 5వేల చొప్పున పింఛను అందిస్తామని ప్రకటించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న నటీనటుల పిల్లల మార్కులు 75 శాతం దాటితే ప్రోత్సాహకంగా రూ. లక్ష అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కృష్ణ, కృష్ణంరాజు దంపతులను 'మా' ఘనంగా సన్మానించింది. 
maa
dairay
tollywood

More Telugu News