Uttar Pradesh: రాజ్ నాథ్ సింగ్ కు చేదు అనుభవం... నానాయాగీ చేసిన రామ భక్తులు!

  • యూపీలో చేదు అనుభవం
  • రామమందిరం కావాలంటూ నిరసన
  • సర్దిచెప్పిన పోలీసులు, నేతలు
కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కు యూపీలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన తన సొంత నియోజకవర్గమైన లక్నోలో పర్యటిస్తున్న వేళ, ఓ కార్యక్రమంలో రామ భక్తులు కొందరు నానాయాగీ చేశారు. "అయోధ్యలో శ్రీరామమందిరం నిర్మించిన వారికే ఓటువేస్తాం. వారినే ఎన్నుకుంటాం" అంటూ నినాదాలు చేయడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. జరుగుతున్న గందరగోళంపై రాజ్ నాథ్ సైతం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. దేనికైనా సమయం రావాలని గట్టిగా సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు, బీజేపీ నేతలు కల్పించుకుని రామభక్తులకు సర్దిచెప్పడంతో, వారు కాస్తంత వెనక్కు తగ్గారు. దీంతో సభ సజావుగా సాగింది.
Uttar Pradesh
Rajnath Singh
Ram Bhakt
Ram Temple
Ayodhya

More Telugu News