Rajamouli: 'బాహుబలి'ని హిందీలో తీసుంటే... ఏ పాత్రకు ఎవరు?: రాజమౌళి సమాధానం ఇదిగో

  • తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన 'బాహుబలి'
  • హిందీలో దేవసేన పాత్రకు దీపిక
  • బాహుబలిగా మరొకరిని ఊహించుకోలేనన్న రాజమౌళి
తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన రాజమౌళి చిత్రరాజం 'బాహుబలి'ని హిందీలో తీసుంటే... బాహుబలి, భల్లాలదేవ, దేవసేన పాత్రలకు ఎవరిని తీసుకునివుండేవారు? ఇదే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. రానా, ప్రభాస్ లతో కలసి రాజమౌళి, 'కాఫీ విత్ కరన్'లో పాల్గొనగా, 6వ ఎపిసోడ్ లో ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇచ్చారు.

 దేవసేన పాత్రకు బాలీవుడ్ నుంచి దీపికా పదుకొనే అయితే, బాగుంటుందని చెప్పారు. అంతకుముందు రానా, ప్రభాస్ లను ఇదే ప్రశ్న విడివిడిగా అడగగా, హిందీలో ఇదే చిత్రం తీస్తే దీపిక అయితేనే దేవసేన పాత్రకు సరిపోతుందని అభిప్రాయపడటం గమనార్హం. ఇక బాహుబలి, భల్లాలదేవుడి పాత్రలకు ప్రత్యామ్నాయంగా ఎవరినీ ఊహించుకోలేనని, బాహుబలిగా ప్రభాస్, భల్లాలదేవుడిగా రానా మాత్రమే నప్పుతారని వ్యాఖ్యానించారు. 
Rajamouli
Bahubali
Prabhas
Rana
Coffee with Karan

More Telugu News