Disha Patani: అసలు సిగ్గు అన్న పదం గురించే ఆలోచించను!: దిశా పటాని

  • ఇటీవల సోషల్ మీడియాలో దిశా పటానీ హాట్ ఫోటోలు
  • హీరోయిన్ గా అవకాశాల కోసం తప్పదని వెల్లడి
  • గ్లామర్ ప్రపంచంలో సిగ్గు పడవద్దని సలహాలు
కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్టు చేసి కలకలం రేపిన దిశా పటానీ, ఆ ఫోటో షూట్ గురించి తన మనసులోని మాటలు చెప్పేసింది. హీరోయిన్‌ గా అవకాశాలు రావాలంటే, ఇటువంటి ఫోటో షూట్లు తప్పనిసరని అంది. ఫోటోలు దిగుతుంటే, కొందరు ఒకే కోణం నుంచి చూస్తున్నారని, తనకు మాత్రం కెమెరా మాత్రమే కనిపిస్తుందని చెప్పింది.

ఆ సమయంలో తన ఎదురుగా ఎవరు ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోబోనని, అసలు సిగ్గు అన్న పదం గురించి కూడా ఆలోచించనని అంటోంది. సిగ్గు గురించి ఆలోచించేవాళ్లు, ఈ పరిశ్రమ గురించే ఆలోచించకూడదని, అసలీ ఫీల్డ్‌ లోకి రాకూడదని అన్నీ తెలిసిన అనుభవజ్ఞురాలి మాదిరి చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమ గ్లామర్ ప్రపంచమని, దానిలో ఉన్నప్పుడు అలాంటి వాటిని పట్టించుకోకూడదని జూనియర్లకు సలహా ఇస్తోంది దిశా పటానీ.
Disha Patani
Tollywood

More Telugu News