KCR: ప్రజా సంక్షేమం కోసం మరో యాగానికి కేసీఆర్ రెడీ.. వైజాగ్‌లో స్వరూపానందేంద్ర స్వామితో ఏకాంత చర్చ

  • యాగాలపై కేసీఆర్‌కు అచంచల విశ్వాసం
  • ఇప్పటికే పలు యాగాల నిర్వహణ
  • తాజాగా మరొకటి నిర్వహించాలని నిర్ణయం
యాగాలపై అచంచల విశ్వాసం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విశాఖపట్టణం వెళ్లిన సీఎం.. స్వరూపానందేంద్ర స్వామితో ఏకాంతంగా మాట్లాడారు. ఈ సందర్భంగా యాగం గురించి మాట్లాడినట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పలుమార్లు యాగాలను నిర్వహించిన ఆయన రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా యాగం చేశారు. డిసెంబరు 2015లో ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయుత చండీయాగం నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు కూడా రెండు రోజులపాటు రాజశ్యామల యాగం నిర్వహించారు.

తాజాగా, మరోమారు యాగం చేయాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం యాగం నిర్వహించాలని నిర్ణయించిన కేసీఆర్ ఈ విషయమై స్వామీజీతో చర్చించినట్టు సమాచారం. అయితే, కేసీఆర్ నిర్వహించబోయేది సహస్ర ఆయుత చండీ యాగమా? లేక ఇంకేదైనానా? అనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
KCR
Telangana
Vizag
swaroopanandendra swamy
Yagam

More Telugu News