Visakhapatnam: మెస్‌ల మూసివేతకు నిరసనగా విద్యార్థుల ఆందోళన.. ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్రిక్తత

  • క్రిస్‌మస్ సెలవుల నేపథ్యంలో హాస్టళ్ల మూసివేత
  • నోటిఫికేషన్లు వెలువడడంతో కొనసాగించాలని డిమాండ్
  • పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వివాదం
క్రిస్‌మస్ సెలవుల నేపథ్యంలో హాస్టళ్లు, మెస్‌లు మూసివేయడాన్ని నిరసిస్తూ ఆదివారం రాత్రి విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇటీవల పలు ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో హాస్టళ్లను, మెస్‌లను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని హాస్టళ్లను తెరవాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వివాదం జరిగింది.
Visakhapatnam
Andhra university
Students
Andhra Pradesh
Police

More Telugu News