పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం.. రేపట్నుంచి గేట్ల బిగింపు.. హాజరవుతున్న చంద్రబాబు
- 41వ గేటు అమరిక కోసం పూజలు నిర్వహించనున్న చంద్రబాబు
- అనంతరం రైతుల బహిరంగసభలో పాల్గొననున్న సీఎం
- ఆ తర్వాత ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష
ఉదయం అమరావతి నుంచి పోలవరంకు చంద్రబాబు హెలికాప్టర్ లో బయల్దేరుతారు. ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు గేటు ఏర్పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం 10.30 గంటలకు ప్రాజక్టు పనులను ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత రైతులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. అనంతరం ప్రాజెక్టు పురోగతి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడకు తిరుగుపయనమవుతారు.