aditirao hyderi: నాకు కూడా వేధింపులు ఎదురయ్యాయి.. చాలా అప్ సెట్ అయ్యా: అదితీరావ్ హైదరీ

  • కెరీర్ ప్రారంభంలో వేధింపులను ఎదుర్కొన్నా
  • అడ్జస్ట్ అయితే ఛాన్స్ ఇస్తామని చెప్పారు
  • ఆ ప్రాజెక్టు నుంచి సింపుల్ గా బయటకు వచ్చేశా
ఫిలిం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని సినీ నటి అదితీరావ్ హైదరీ తెలిపింది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తన కెరీర్ ప్రారంభంలో తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలిపింది. ఒక ప్రాజెక్టుకు సంబంధించి... అడ్జస్ట్ అయితే ఛాన్స్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారని చెప్పింది.

అయితే, దాని గురించి తాను ఎక్కువగా ఆలోచించలేదని.... సింపుల్ గా ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశానని తెలిపింది. దాని వల్ల తాను ఎనిమిది నెలల పాటు పని కోల్పోయానని.... చాలా అప్ సెట్ అయ్యానని చెప్పింది. ఇక సినిమాల్లో నటించలేనా? అని తనలో తాను బాధ పడ్డానని... అయితే, తన టీమ్, తన మేనేజన్ తనను నెగెటివ్ ఆలోచనల నుంచి బయటకు తీసుకొచ్చారని తెలిపింది.
aditirao hyderi
actress
bollywood
tollywood
metoo

More Telugu News