lakhsmis ntr: నా మీదే కేసులు పెట్టినప్పుడు.. ఎన్టీఆర్ మీద మరెన్ని కేసులు పెట్టాలి?: వర్మ

  • సినిమా ప్రమోషన్ లో భాగంగా టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతున్న వర్మ
  • వరుస ట్వీట్లతో కాక పుట్టిస్తున్న వైనం
  • తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన వీడియోను అప్ లోడ్ చేసిన వర్మ
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రమోషన్ ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రారంభించారు. ఏదో ఒక అంశాన్ని వివాదాస్పదం చేయడం ద్వారా పబ్లిసిటీని పెంచుకోవడంలో వర్మకు మరెవరూ సాటిరారు అనే విషయం అందరికీ తెలిసిందే. తన తాజా చిత్రానికి సంబంధించి 'కుట్ర' అనే పాటను విడుదల చేయడం ద్వారా వర్మ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు.

ఇది సరిపోదన్నట్టు... వరుస ట్వీట్లు చేస్తూ మరింత రెచ్చగొడుతున్నారు. తనపై టీడీపీ నేతలు వేసిన కేసులపై ఆయన స్పందిస్తూ... తాను చంద్రబాబును డైరెక్ట్ గా ఒక్క మాట కూడా అనలేదని చెప్పారు. ఏమీ అనని తనమీదే కేసులు పెడితే... ఈ వీడియోలో ఉన్న వ్యక్తిపై ఎన్ని కేసులు పెట్టాలంటూ దివంగత ఎన్టీఆర్ వీడియోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు.
lakhsmis ntr
rgv
varma
Chandrababu
ntr
Telugudesam
tollywood

More Telugu News