NTR biopic: చూసిన వారికి చూడ ముచ్చటట...! : ఎన్టీఆర్‌ బయోపిక్‌ ట్రైలర్‌కు విశేష స్పందన

  • ఒక్క రోజులో 40 లక్షల మంది వీక్షణం
  • రెండు భాగాలుగా వస్తున్న జీవిత చరిత్ర
  • తొలిభాగం కథా నాయకుడు
ఎన్టీఆర్‌ బయోపిక్‌ ‘ట్రైలర్‌’తోనే తన స్టామినా ఏంటో నిరూపిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 40 లక్షల మంది ఈ ట్రైలర్ ను చూడడం విశేషం. ‘అరవై ఏళ్లు వస్తున్నాయి. ఇన్నాళ్లు మా కోసం బతికాం. ఇక ప్రజల కోసం, ప్రజాసేవలో బతకాలి అనుకుంటున్నాం’ అన్న డైలాగ్‌తో శుక్రవారం విడుదలైన ట్రైలర్‌ను చూసిన ప్రముఖులు కూడా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో తెలుగువారి అభిమాన నటుడు దివంగత ఎన్టీఆర్‌ జీవితాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా విద్యా బాలన్‌, చంద్రబాబుగా రానా, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సావిత్రిగా నిత్యామీనన్‌, ప్రభగా శ్రియ నటిస్తున్నారు. బయోపిక్‌లో తొలి భాగం ‘కథానాయకుడు’ వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రెండో భాగం ‘మహానాయకుడు’ను ఫిబ్రవరి 7న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
NTR biopic
trailer
higlet views

More Telugu News