Lakshmi`s Ntr: ‘వెన్నుపోటు’ పాటపై ఫిర్యాదు చేసిన వాళ్లందరికీ నా కృతఙ్ఞతలు: వర్మ సెటైర్లు

  • ‘వెన్నుపోటు’ పాటపై మండిపడుతున్న టీడీపీ నేతలు
  • నా దిష్టిబొమ్మలు దహనం చేస్తున్న వాళ్లకీ కృతఙ్ఞతలు
  • ఎందుకంటే, ‘వెన్నుపోటు’ వీక్షకుల సంఖ్యను మరింతగా పెంచుతున్నందుకు
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లోని ‘వెన్నుపోటు’ పాట విషయమై ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సహా చిత్రయూనిట్ పై టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. వారిపై పరువు నష్టంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీడీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పడంపై వర్మ స్పందించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లోని ‘వెన్నుపోటు’ పాటపై నిరసన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఎవరైతే ఫిర్యాదులు చేస్తున్నారో, దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారో వాళ్లందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే, వాళ్లందరూ ‘వెన్నుపోటు’ వీక్షకుల సంఖ్యను మరింతగా పెంచుతున్నారు.. అంటూ వర్మ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
Lakshmi`s Ntr
ram gopal varma
Telugudesam
sv mohan reddy

More Telugu News