దేశ భద్రతపై రాజకీయాలా?: రాహుల్ గాంధీపై అమిత్ షా నిప్పులు
- దర్యాప్తు సంస్థలకు కొత్త అధికారాలు
- ప్రభుత్వ ఉత్తర్వులపై విపక్షాల ఆందోళన
- ప్రజల్లో రాహుల్ భయాందోళనలు సృష్టిస్తున్నారన్న అమిత్ షా
రాహుల్ విమర్శలపై బీజేపీ చీఫ్ అమిత్ షా మండిపడ్డారు. రాహుల్ అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. దేశ భద్రతపై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశాస్త్రీయ నిఘా నియంత్రణకు గతంలో యూపీఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు మోదీ ఆ పనిచేస్తుంటే రాహుల్ ఓర్వ లేక కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.