NTR BIOPIC: ‘ఎన్టీఆర్’ ఆడియోను ఆవిష్కరించిన నందమూరి సోదరులు

  • ఆవిష్కరించిన మోహనకృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ
  • అంగరంగ వైభవంగా జరుగుతున్న వేడుక
  • ఈ వేడుకకు పలువురు ప్రముఖుల హాజరు
ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో సీడీని నందమూరి సోదరులు మోహనకృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ ఆవిష్కరించారు. హైదరాబాద్ లో ఈ సాయంకాలం ఆడియో వేడుక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు, ఈ చిత్రంలోని తొలి పాటను నందమూరి బాలకృష్ణ కుటుంబసభ్యులు ఆవిష్కరించారు. నారా బ్రాహ్మణి లాంచ్ అని చెప్పడంతో తొలి పాటను ఆవిష్కరించారు.

అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర యూనిట్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నటులు రానా, సుమంత్, పరుచూరి సోదరులు, పలువురు దర్శకులు, నిర్మాతలు, పాటల రచయితలు, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు హాజరయ్యారు.
NTR BIOPIC
nandamuri brothers
junior ntr
Balakrishna

More Telugu News