hanuman: దేవుడికి కూడా కులం ఉంటుందనే విషయం నాకు తెలియదు: మంచు విష్ణు

  • నాకు తెలిసిన హనుమంతుడు వానర దేవుడు
  • శక్తిసామర్థ్యాలు, ధైర్యానికి చిహ్నం
  • ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు
హనుమంతుడి కులం, మతంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంజనేయస్వామి దళితుడని యూపీ ముఖ్యమంత్రి చెప్పగా, ఆయన ముస్లిం అని మరో నేత, జాట్ కులస్తుడని ఇంకొక నాయకుడు... ఇలా ఎవరికి వారే ఆయనకు కులమతాలను ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశంపై సినీ నటుడు మంచు విష్ణు అసహనం వ్యక్తం చేశాడు. దేవుళ్లకు కూడా కులం వుంటుందనే విషయం తనకు తెలియదని విష్ణు ట్వీట్ చేశాడు. తనకు తెలిసిన హనుమంతుడు వానర దేవుడని... అంతులేని శక్తిసామర్థ్యాలు, ధైర్యానికి చిహ్నమని చెప్పాడు. ప్రతి ఒక్కరిని హనుమంతుడు సమానంగా చూస్తాడని, అవసరమైతే శిక్షిస్తాడని తెలిపాడు.
hanuman
manchu vishnu
tollywood

More Telugu News