chiranjeevi: 'సైరా' నుంచి తమన్నా ఫస్టు లుక్!

  • ఈ రోజు తమన్నా పుట్టినరోజు 
  • 'సైరా' టీమ్ నుంచి శుభాకాంక్షలు 
  • లక్ష్మి పాత్రలో కొత్తగా కనిపిస్తోన్న తమన్నా         
చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' నిర్మితమవుతోంది. భారీ తారాగణంతో .. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రూపొందుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో తమన్నా కీలకమైన పాత్రను పోషిస్తోంది.

ఈ రోజున తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా తమన్నా పాత్రను పరిచయం చేస్తూ .. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె ఫస్టులుక్ ను .. మోషన్ టీజర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తమన్నా .. లక్ష్మి పాత్రలో కనిపించనుందనేది మోషన్ టీజర్ వలన తెలుస్తోంది. తమన్నా పాత్ర తీరుతెన్నుల  విషయం అటుంచితే, ఆమె వేషధారణ మాత్రం కొత్తగా వుంది. కొత్త తమన్నాను తెరపై చూడబోతున్నామనే ఆసక్తిని పెంచుతోంది. 'బాహుబలి' తరువాత తమన్నా చేస్తోన్న భారీ చిత్రం ఇదే. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందనే ఆశాభావంతో తమన్నా వుంది.
chiranjeevi
nayanatara
thamannah

More Telugu News