Tamilnadu: తమిళనాడులో రజనీ జోరు.. మూడు టీవీ ఛానల్స్ పెట్టనున్న సూపర్ స్టార్!

  • పేర్లను రిజిస్టర్ చేయించిన రజనీ ప్రతినిధులు
  • త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం
  • తమిళనాడులో చురుగ్గా రజనీ పావులు
రోబో 2.ఓ, పెట్టా సినిమాలతో జోరుమీదున్న సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా రాజకీయ రంగంలోనూ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రజనీ మూడు ఛానల్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే కు కలైంజర్ టీవీ, అన్నాడీఎంకేకు జయ టీవీ వంటి ఛానల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు, ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు తనకు సొంత ఛానళ్ల అవసరం ఉందని రజనీ భావిస్తున్నట్లు సమాచారం.

రజనీకాంత్ టీవీ, సూపర్ స్టార్ టీవీ, తలైవా టీవీ పేరుతో మూడు ఛానల్స్ ను ఆయన ప్రారంభిస్తారని తెలుస్తోంది. వీటికి సంబంధించిన లోగోలను కూడా రజనీ ప్రతినిధులు రిజిస్టర్ చేయించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికార ప్రకటన వెలువరిస్తామని పేర్కొన్నాయి.
Tamilnadu
Rajinikanth
political party
3 news channels

More Telugu News