prabhas: 2020 సంక్రాంతికి ప్రభాస్ రొమాంటిక్ లవ్ స్టోరీ

షార్ట్స్‌లో చూడండి
ప్రభాస్ కథానాయకుడిగా .. యాక్షన్ ఎంటర్టైనర్ గా 'సాహో' రూపొందుతోంది. సుజిత్ దర్శకత్వంలో నిర్మితమవుతోన్న ఈ సినిమా ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసుకుంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోని రొమాంటిక్ లవ్ స్టోరీని కూడా ప్రభాస్ పట్టాలెక్కించాడు.

ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇటలీలో జరిగిన ఈ షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను 2020 సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయం జరిగిపోయిందనేది తాజా సమాచారం. ప్రేక్షకులు ప్రభాస్ ను రొమాంటిక్ లవ్ స్టోరీలో చూసి చాలాకాలమే అయింది. వాళ్ల ముచ్చట 2020 సంక్రాంతికే తీరనుందన్న మాట.
Go Back to Shorts
prabhas
pooja hegde

More Telugu News