prajasathi party: ఏపీ ఎన్నికలలో పోటీకి దిగుతాం!: 'ప్రజాశాంతి' పార్టీ కోఆర్డినేటర్‌ హిప్నోకమలాకర్‌

  • అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ
  • కేఏ పాల్‌ నేతృత్వంలో సత్తా చాటుతామని ప్రకటన
  • తెంగాణలోనూ కీలకపాత్ర పోషిస్తామని వెల్లడి
డాక్టర్‌ కె.ఎ.పాల్‌ నేతృత్వంలో ప్రజాశాంతి పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటేందుకు సిద్ధమవుతోందని, అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను పోటీకి నిలపనున్నామని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ హిప్నోకమలాకర్‌ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలోని మైండ్‌ అండ్‌ పర్సనాలిటీ కేర్‌ కార్యాలయంలో పార్టీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్షం రోజుల్లో 13 జిల్లాలకు కన్వీనర్ల నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపడతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే ఆయన తన అనుభవాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకుని మోసం చేశారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ప్రజాశాంతి పార్టీ ఏపీ, తెలంగాణతోపాటు దేశమంతా తనదైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. 
prajasathi party
hipno kamalakar
ap elections

More Telugu News