Chandrababu: ఏపీలో ఎన్నికలొస్తే చంద్రబాబును ఇంటికి పంపించడం ఖాయం: లక్ష్మీపార్వతి

  • ఏపీలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు
  • ఎన్నికలొస్తున్నాయనే ఎన్టీఆర్ విగ్రహమంటున్న బాబు
  •  చంద్రబాబు మాయమాటలు నమ్మొద్దు
ఏపీలో ఎన్నికలెప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని వైసీపీ నేత లక్ష్మీపార్వతి  అన్నారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఏపీలో ఎన్నికలు వస్తే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపిస్తారని జోస్యం చెప్పారు. ఏపీలో ఎన్నికలొస్తున్నాయని చెప్పే అమరావతిలోని నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని విమర్శించారు. నీరుకొండలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామంటున్న చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మొద్దని లక్ష్మీపార్వతి కోరారు.
Chandrababu
Telugudesam
lakshmi paravathi
ysrcp

More Telugu News