madhunandan: పవన్ ను చూసి షాక్ అయ్యాను .. చిరూను చూడాలని వుంది: నటుడు మధునందన్

షార్ట్స్‌లో చూడండి
చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి చాలాకాలమే అయినా, 'గీతాంజలి' సినిమాతో మధునందన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వచ్చిన 'టాక్సీవాలా' సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా ఆయన ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. అలాంటి మధునందన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

"నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చిరంజీవిగారి అభిమానిని. నేను చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతున్నప్పుడు కూడా చిరంజీవి గారిని చూడాలి .. కలుసుకోవాలి అనుకున్నాను. కానీ చిరంజీవిగారికంటే ముందుగా నేను పవన్ కల్యాణ్ గారిని కలుసుకున్నాను. పవన్ కల్యాణ్ గారిని చూసినప్పుడు నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. 'నీ పేరేంటి .. సెల్ఫీ కావాలా?' అని పవన్ కల్యాణ్ గారు అడిగిన మాట కూడా నాకు సరిగ్గా వినిపించలేదు. నా ఫోన్ తో ఆయనే సెల్ఫీ తీసి నా ఫోన్ ను నా చేతిలో పెడుతుంటే అలాగే చూస్తుండిపోయాను. ఇక చిరంజీవిగారిని కలుసుకునే అవకాశం వస్తే ఏమైపోతానో .. ఏమో" అంటూ నవ్వేశాడు. 
Go Back to Shorts
madhunandan

More Telugu News