chinajeeyar: ఆలయంలో కూలిన స్టేజ్.. చినజీయర్ స్వామికి తప్పిన ప్రమాదం

  • వైకుంఠ ఏకాదశి రోజున ఘటన
  • కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో కూలిన స్టేజ్
  • చినజీయర్ తో పాటు పడిపోయిన పూజారులు
చినజీయర్ స్వామికి తృటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ కొత్తపేటలో ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి ఆయన వెళ్లారు. ఆలయ గోపురానికి పూజలు నిర్వహిస్తుండగా ప్రమాదం సంభవించింది. ఆలయం చుట్టూ కట్టిన స్టేజ్ లాంటి నిర్మాణం కూలిపోవడంతో చినజీయర్ తో పాటు ఇతర పూజారులు కూడా పడిపోయారు. అయితే మధ్యలో కొంత పట్టు దొరకడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన వైకుంఠ ఏకాదశి రోజున సంభవించగా... ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగు చూశాయి.
chinajeeyar
accident
hyderabad

More Telugu News