Vishal: బ్రేకింగ్... నిరసనకు దిగిన హీరో విశాల్ అరెస్ట్!

  • ఒకేరోజు విడుదలకు సిద్ధమైన పలు చిత్రాలు
  • నిర్మాతలకు, మండలికి మధ్య విభేదాలు
  • నిరసనకు దిగినందున విశాల్ అరెస్ట్
తమిళనాడులో ఒకేరోజు పలు చిత్రాలు విడుదలకు సిద్ధమైన వేళ నెలకొన్న వివాదం నిర్మాతలకు, నిర్మాతల మండలికి మధ్య తీవ్ర విభేదాలను రేకెత్తిస్తుండగా, కొద్దిసేపటి క్రితం హీరో విశాల్ ను చెన్నై నగర పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎఫ్పీసీ కార్యాలయానికి తాళం వేసిన నిర్మాతలు నిన్న తాళం చెవులను పోలీసు స్టేషన్ లో అప్పగించిన సంగతి తెలిసిందే. తన కార్యాలయానికి తాళం వేయడంపై తీవ్రంగా మండిపడ్డ విశాల్, తన అనుచరులతో రోడ్డుపై నిరసనలకు దిగడంతో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.



Vishal
Arrest
Chennai

More Telugu News