Nara Lokesh: నాయనా చిట్టీ... ఆరు నెలలాగితే లెక్క తేలుస్తాం: లోకేశ్ కు విజయసాయి రెడ్డి కౌంటర్

  • లోకేశ్ ఎన్ని పరిశ్రమలు తెచ్చారో లెక్క తేలుస్తాం
  • కమిషన్లకు కక్కర్తి పడి బోగస్ కంపెనీలకు భూములు
  • ఎల్లో మీడియా దాచిపెడితే దాగదన్న విజయసాయి రెడ్డి
మరో ఆరు నెలలు ఓపిక పడితే, లోకేశ్ లెక్క తేలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టిన ఆయన, ఎల్లో మీడియా సాయంతో దాచినంత మాత్రాన నిజాలు దాగవని అన్నారు.

"లోకేష్ నాయుడు తెచ్చిన పరిశ్రమలెన్నో, ఐటి కంపెనీలెన్నో లెక్క తేలుస్తాం. 6 నెలలు ఓపిక పట్టు చిట్టి. కమిషన్లకు కక్కుర్తి పడి బోగస్ కంపెనీలకు వందల కోట్ల విలువైన భూములు, రాయితీలిచ్చింది ప్రజలకు తెలుసు. యెల్లో కుల మీడియా దాచిపెట్టినంత మాత్రాన ప్రజల కళ్లకు గంతలు కట్టలేరు" అని అన్నారు.

అంతకుముందు మరో పోస్టు పెడుతూ, "దొడ్డిదారి మంత్రి లోకేష్ సవాళ్లు వింటే నవ్వొస్తుంది. ప్రతిపక్ష నాయకుడు ఎండనక, వాననక ఏడాది పైగా ప్రజల మధ్య పాదయాత్ర చేస్తుంటే కనిపించట్లేదా చిట్టి? కరెంటు,మంచినీరు లేక చలిలో ప్రజలు హాహాకారాలు చేస్తుంటే 4 రోజులు అమరావతి, 3 రోజులు హైదరాబాద్ దాటి బయటకు రాని నువ్వు వైఎస్సార్ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నవా? బందిపోట్లలా దోచుకున్న ప్రజల సొమ్మును తెలంగాణా ఎన్నికల్లో వెదజలల్లింది ఎవరో? అక్కడి ప్రజలు ఫుట్ బాల్ ఆడుకుంటే జైపూర్, బోపాల్ చుట్టు తిరిగిరావడం ప్రజా సేవా?" అని ప్రశ్నించారు.

Nara Lokesh
Vijayasai Reddy
Facebook

More Telugu News