కేటీఆర్, ఎన్టీఆర్ కలయిక.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో

షార్ట్స్‌లో చూడండి
తన సినీ కెరీర్ పై పూర్తిగా దృష్టిని కేంద్రీకరించిన జూనియర్ ఎన్టీఆర్... రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. కూకట్ పల్లి నుంచి తన సోదరి నందమూరి సుహాసిని ఎన్నికల బరిలోకి దిగినా... ప్రచారానికి దూరంగానే ఉన్నాడు. 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ బిజీ వల్ల ప్రచారానికి రాలేకపోయాడు. మరోవైపు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలసి తారక్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరూ కలసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ కలయిక ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు.


Go Back to Shorts
junior ntr
kct
photo
tollywood
TRS

More Telugu News