sumanth: ఆసక్తిని పెంచుతోన్న 'ఇదం జగత్' ట్రైలర్

  • సుమంత్ హీరోగా 'ఇదం జగత్'
  • కథానాయికగా అంజు కురియన్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు    
ఇటీవల కాలంలో సుమంత్ వైవిద్యభరితమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలా రీసెంట్ గా ఆయన చేసిన 'సుబ్రహ్మణ్యపురం' ఫరవాలేదనిపించుకుంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఇదం జగత్' సిద్ధమవుతోంది. సుమంత్ జోడీగా అంజు కురియన్ నటించిన ఈ సినిమాకి శ్రీకాంత్ నీలకంఠం దర్శకత్వం వహించాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 'ఒక రిపోర్టర్ సైలెంట్ గా ఉన్నాడంటే దాని అర్థం .. వాడు మనకి దగ్గరగా వచ్చేశాడని' అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. సినిమాపై ఆసక్తిని పెంచేదిగానే ఈ ట్రైలర్ వుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో సుమంత్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
sumanth
anju

More Telugu News