Prostitution: వ్యభిచారం చేయడం ఇష్టంలేని యువతి ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసుల దాడులు!

  • మోసం చేసి యువతులను రప్పించిన వ్యక్తి
  • రాజేంద్రనగర్ పరిధిలో బలవంతపు వ్యభిచారం
  • సమయం చూసి పోలీసులకు ఉప్పందించిన యువతి
తనను బంగ్లాదేశ్ నుంచి మోసపు మాటలతో ఇండియాకు రప్పించారని, ఇక్కడ తనను బలవంతంగా వ్యభిచారంలోకి దింపి డబ్బు సంపాదిస్తున్నారని ఓ యువతి చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. రాజేంద్రనగర్ పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం,  హకీంహిల్స్‌ ప్రాంతానికి చెందిన సర్పరాజ్‌ ఖాన్‌ (27) అనే వ్యక్తి ఇటీవల బంగ్లాదేశ్‌ లో తనకు తెలిసిన ఏజెంట్‌ ద్వారా ఇద్దరు అమ్మాయిలను హైదరాబాద్ రప్పించాడు.

వారిని తొలుత సముద్ర మార్గంలో కొల్‌కతాకు ఆపై అక్కడి నుంచి హైదరాబాద్ కు చేర్చారు. వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. వారిలోని ఓ యువతికి ఈ పని ఇష్టంలేదు. దీంతో సమయం చూసి, ఆమె పోలీసులకు ఉప్పందించింది. దీంతో నిన్న పోలీసులు ఆ ఇంటిపై దాడిచేశారు. సర్ఫరాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని, ఇద్దరు యువతుల్లో ఒకరిని గుర్తించి, బాలికల సదనానికి పంపామని అన్నారు. రెండో యువతిని గుర్తించే పనిలో ఉన్నామని, వారికి పాస్ పోర్టులు ఉన్నాయా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.
Prostitution
Bangladesh
Raids
Police
Hyderabad

More Telugu News