Kinjarapu Acchamnaidu: జగన్ పాదయాత్రలో జనాలేరి?: అచ్చెన్నాయుడు

  • పాదయాత్రలో ఉన్నది జగన్ సొంత మనుషులే
  • జగన్ యాత్రకు ప్రజల నుంచి స్పందన కరవు
  • టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో అచ్చెన్నాయుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్‌ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు కనిపించడం లేదని, కేవలం ఆయన సొంత మనషులు మాత్రమే కనిపిస్తున్నారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జగన్, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా, అదే ప్రాంతంలో జరిగిన తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

గడచిన నాలుగున్నరేళ్లలో వందేళ్ల అభివృద్ధిని తాను చేసి చూపించానని, అందువల్లే జగన్ యాత్రకు ప్రజల నుంచి స్పందన లేదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా తన వద్దకు వచ్చిన వారందరికీ సేవ చేశానని, వైసీపీలో తనతో పోటీ పడే నేత లేనేలేడని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా భావనపాడు పోర్టును నిర్మించాలని నిర్ణయించామని, ఇందులో సుమారు రూ. 5000 కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపారు. రుణమాఫీ చేసిన సీఎం చంద్రబాబును ఇప్పుడు అన్ని రాష్ట్రాలూ అనుసరిస్తున్నాయని, సీఎంలుగా బాధ్యతలు స్వీకరిస్తున్న వారంతా రుణమాఫీ చేస్తున్నారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
Kinjarapu Acchamnaidu
Tekkali
Jagan
YSRCP

More Telugu News