Congress: ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు

  • ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన నలుగురు నేతలు
  • బుధవారం లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
  • కె. దామోదర్‌పై ఫిర్యాదుకు కాంగ్రెస్ సిద్ధం
టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికై ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, యాదవరెడ్డి, కొండా మురళి, రాములునాయక్‌లకు శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ బుధవారం నోటీసులు జారీ చేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో వీరు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం చేశారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ చీఫ్ విప్ ఫిర్యాదు చేశారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వీరిపై అనర్హత వేటు వేయాలని కోరారు.

స్పందించిన శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ బుధవారం నలుగురు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేశారు. పార్టీ మారిన మిమ్మల్ని అనర్హులుగా ఎందుకు ప్రకటించకూడదో చెప్పాలంటూ నోటీసులో పేర్కొన్నారు. వచ్చే బుధవారం లోగా వివరణ ఇవ్వాలని కోరారు. మరోవైపు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీ కె.దామోదర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ కూడా సిద్ధమవుతోంది.  
Congress
TRS
MLCs
swamy goud
Telangana

More Telugu News