balakrishna: 'మహానాయకుడు'కి కొత్త రిలీజ్ డేట్

  • పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో 'కథానాయకుడు'
  • షూటింగు దశలో 'మహానాయకుడు'
  • వైఎస్ బయోపిక్ కి ఒకరోజు ముందు రిలీజ్
ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగమైన 'కథానాయకుడు' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ముందుగా అనుకున్న ప్రకారమే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక బయోపిక్ లో రెండవ భాగమైన 'మహానాయకుడు'ను జనవరి 24వ తేదీన విడుదల చేయాలని భావించారు.

ఈ రెండు భాగాల మధ్య గ్యాప్ కాస్త ఎక్కువగా ఉండాలనే బయ్యర్ల కోరిక మేరకు ఫిబ్రవరి 3వ వారంలో విడుదల చేయాలని భావించారు. అయితే ఆంధ్రలో రానున్న ఎన్నికలు .. నిబంధనలు దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయడమే మంచిదనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చేశారట. ఆ మరుసటి రోజునే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా రూపొందిన 'యాత్ర' రానుంది. ఆల్రెడీ ఈ డేట్ ను 'యాత్ర' టీమ్ ప్రకటించింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
balakrishna
vidyabalan
nithya

More Telugu News