సిరిసిల్లలో కేటీఆర్ కు ఘన స్వాగతం..పూల వర్షం కురిపించిన టీఆర్ఎస్ శ్రేణులు

షార్ట్స్‌లో చూడండి
సిరిసిల్లలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారిగా సిరిసిల్లకు విచ్చేసిన ఆయన రోడ్ షో లో పాల్గొన్నారు. సిరిసిల్ల చేరుకున్న కేటీఆర్.. తొలుత నేతన్న, అంబేద్కర్, గాంధీ మహాత్ముడి విగ్రహాలకు పూలమాలలు వేశారు. రోడ్ షో లో పాల్గొన్న కేటీఆర్ పై కార్యకర్తలు, నాయకులు పూల వర్షం కురిపించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, తనకు జన్మనిచ్చింది కన్న తల్లే కానీ, రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సిరిసిల్ల అని ఆనందం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున తనకు స్వాగతం పలికిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లందరికీ తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో తనను అఖండ మెజార్టీతో గెలిపించిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, అఖండమైన మెజార్టీతో టీఆర్ఎస్ ను గెలిపించారని అన్నారు.

ఈ రోజున రాష్ట్రంలో తాను ఎక్కడికి పోయినా తనకు గుర్తింపు రావడానికి కారణం సిరిసిల్ల ప్రజలేనని, తనకు రాజకీయ ఉనికిని ఇచ్చింది ఇక్కడి ప్రజలేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. 
Go Back to Shorts
siricilla
KTR
TRS
kcr
road show

More Telugu News