ram mohan naidu: పుట్టినరోజు శుభాకాంక్షలు సోదరా.. రామ్మోహన్ నాయుడుకు టీఆర్ఎస్ కవిత గ్రీటింగ్స్

  • నిన్న 30వ పుట్టిన రోజు జరుపుకున్న రామ్మోహన్ నాయుడు
  • శుభాకాంక్షలు తెలిపిన కవిత
  • పుట్టినరోజున పార్లమెంటు ప్రాంగణంలో నిరసన చేపట్టిన రామ్మోహన్
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు నిన్న తన 30వ పుట్టినరోజును జరుపుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో ఆయన నిరసన దీక్షను చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష స్ఫూర్తితో తాను దీక్షకు దిగినట్టు ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు మరుసటి రోజు (ఈరోజు) ఆమె గ్రీటింగ్స్ తెలిపారు. 'ఆలస్యంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు సోదరా' అంటూ ట్వీట్ చేశారు.

ram mohan naidu
birthday
kavitha
greetings
TRS
Telugudesam

More Telugu News