Nityananda Swamy: దేశం నుంచి పారిపోయిన నిత్యానంద స్వామి... కేమన్ దీవుల్లో ఆశ్రయం!

  • కేమన్ లో రాజకీయ ఆశ్రయం కోరినట్టు అనుమానం
  • స్వామి ఎక్కడున్నాడో తెలియదంటున్న శిష్య బృందం
  • ఉత్తరాది యాత్రలకు వెళ్లాడంటున్న మరికొందరు
వివాదాస్పద నిత్యానంద స్వామి విదేశాలకు పారిపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం లేకపోయినా, ఆయన ప్రస్తుతం కేమన్ దీవుల్లో రాజకీయ ఆశ్రయం కోరినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. దాదాపు నెల రోజులుగా స్వామి ఎక్కడ ఉన్నాడన్న విషయం తమకు తెలియడం లేదని కొందరు శిష్యులు చెబుతుండగా, ఆయన ఉత్తరాదిలో యాత్రలకు వెళ్లారని మరికొందరు అంటున్నారు.

బెంగళూరు - మైసూరు జాతీయ రహదారిపై బిదడి వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానందస్వామి అసలు పేరు రాజశేఖరన్. ఎనిమిదేళ్ల క్రితం ఓ ప్రముఖ హీరోయిన్ తో రాసలీలలు నడుపుతూ కెమెరాకు చిక్కి తీవ్ర వివాదాస్పదుడయ్యారు. కాగా, కొన్ని క్రిమినల్ కేసుల్లో ఆయన ఇరుక్కోగా, నిత్యానంద పాస్ పోర్టు కూడా రద్దయింది. ఈ నేపథ్యంలో ఆయన దేశం ఎలా దాటుతారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 
Nityananda Swamy
Fleet
Police
Karnataka

More Telugu News