Andhra Pradesh: లేడిస్ హాస్టల్ లో యువతులు స్నానం చేస్తుండగా వీడియో రికార్డింగ్.. మైనర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

  • హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఘటన
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు
సాంకేతిక పరిజ్ఞానం యువతను ఎలా తప్పుదారి పట్టిస్తుందో చెప్పేందుకు తాజా ఉదాహరణ ఇది. తల్లిదండ్రులు ఆడుకునేందుకు కొనిచ్చిన ట్యాబ్ తో ఓ మైనర్ బాలుడు(12) పక్కన బిల్డింగ్ లో యువతులు స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేశాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 3,000 వీడియోలు, ఫొటోలు అతని ట్యాబ్ లో లభ్యమయ్యాయి. చివరికి ఓ యువతి తతంగాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 16న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మాదాపూర్ లోని ఓ లేడిస్ హాస్టల్ పక్కనే బాలుడి కుటుంబం నివాసం ఉంటోంది. 8వ తరగతి చదువుతున్న నిందితుడు పక్కనే హాస్టల్ లో అమ్మాయిలు స్నానం చేస్తుంటే కిటికీ దగ్గర కూర్చుని ట్యాబ్ తో వీడియోలు తీసేవాడు. అయితే ఈ నెల 16న కిటికీ దగ్గర అలికిడి అయినట్లు గమనించిన యువతి పైకి చూడగా, ట్యాబ్ తో నిందితుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు బాలుడి ట్యాబ్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అందులోని వీడియోలు చూసి విస్తుపోయారు. గత ఆరు నెలలుగా దాదాపు పలువురు యువతులకు సంబంధించిన 3,000 వీడియోలు, ఫొటోలను నిందితుడు తీసినట్లు గుర్తించిన అధికారులు, బాలుడిపై కేసు నమోదు చేశారు. ఈ వీడియోలను ఎవరికైనా పంపించాడా? తన వద్దే ఉంచుకున్నాడా? అనే విషయమై నిందితుడిని అధికారులు విచారిస్తున్నారు.
Andhra Pradesh
Telangana
Hyderabad
woman
bath
secret videos
12 year
boy
tab
Police

More Telugu News