Andhra Pradesh: టెక్నాలజీ పితామహుడినని చెప్పుకునే చంద్రబాబు ఈవీఎంలు వదిలి బ్యాలెట్లు ఎందుకు కోరుతున్నారు?: భూమన

  • ఓటమి భయంతోనే చంద్రబాబు వ్యాఖ్యలు
  • అందుకే బ్యాలెట్ ఎన్నికలు కావాలంటున్నారు
  • ఏపీ ముఖ్యమంత్రిపై వైసీపీ నేత విమర్శలు
2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని చంద్రబాబు ఇప్పడెందుకు వద్దంటున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికల్లో బ్యాలెట్ వాడాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించబోతున్నారని చంద్రబాబుకు అర్థమయిపోయిందని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీకి తానే పితామహుడినని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఈవీఎంలను కాదని బ్యాలెట్ పత్రాలను కోరుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.
Andhra Pradesh
Chandrababu
YSRCP
Telugudesam
bhumana

More Telugu News