Andhra Pradesh: మడకశిర ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్న వైసీపీ నేత తిప్పేస్వామి!

  • నేడు స్పీకర్ కార్యాలయంలో బాధ్యతలు
  • ఈరన్న నియామకం చెల్లదన్న హైకోర్టు
  • హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పెరగనుంది. వైసీపీకి చెందిన మడకశిర ఇన్ చార్జీ తిప్పేస్వామి ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమరావతిలోని స్పీకర్ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టనున్నారు. గత ఎన్నికల్లో మడకశిర స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేత ఈరన్న చేతిలో తిప్పేస్వామి ఓటమి పాలయ్యారు.

ఈ నేపథ్యంలో ఈరన్న ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈరన్న తప్పుడు సమాచారం ఇచ్చారని ధ్రువీకరించింది. ఆయన ఎన్నిక చెల్లబోదని తీర్పు చెప్పింది. దీంతో ఈరన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. టీడీపీ నేత పిటిషన్ ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో తన పదవికి ఈరన్న రాజీనామా సమర్పించారు.
Andhra Pradesh
Anantapur District
madakasira
mla
speaker office
YSRCP
thippeswamy
eeranna

More Telugu News