paritala ravi: పరిటాల రవిలా నా భర్త ఫ్యాక్షనిస్టు కాదు: గంగుల భానుమతి

  • సూరి ఎవరినీ చంపలేదు
  • అయినా పద్నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించారు
  • ‘గిన్నిస్ బుక్’ కు ఎక్కే స్థాయిలో రవి హత్యలు చేయించాడు
తన భర్త సూరి ఫ్యాక్షనిస్టు కాదని, పరిటాల రవి ఫ్యాక్షనిస్టని గంగుల భానుమతి అన్నారు. సూరి ఎంతమందిని చంపారు? ఆయన ఎవరినీ చంపలేదని, అయినా పద్నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించారని గుర్తుచేసుకున్నారు. పరిటాల రవి అయితే గిన్నిస్ బుక్ రికార్డుకు ఎక్కే స్థాయిలో హత్యలు చేయించాడని, వందల మందిని చంపారని ఆరోపించారు. తమది ఫ్యాక్షనిస్టుల కుటుంబం కాదని, పరిటాల రవిది మాత్రం అదే కుటుంబమని అన్నారు. తమను నమ్ముకున్న కుటుంబాలకు చెందిన వాళ్లను చాలా మందిని పరిటాల రవి ఉన్నప్పుడు హత్యలు చేయించాడని ఆరోపించారు.  
paritala ravi
maddela cheruvi suri
gangula bhanumati

More Telugu News