mahamood ali: ఈ నెల 20న హోం మంత్రిగా మహమూద్ అలీ బాధ్యతల స్వీకరణ

  • ఆ రోజున నాంపల్లిలోని దర్గాకు వెళ్లనున్న అలీ
  • చాదర్, పూలు సమర్పించనున్న మంత్రి 
  • ఆ తర్వాత నేరుగా సచివాలయానికి 
తెలంగాణ హోం శాఖ మంత్రిగా మహమూద్ అలీ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 20న హోం మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ రోజున మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాకు వెళ్లి చాదర్, పూలను ఆయన సమర్పించనున్నారు. అనంతరం, నేరుగా సచివాలయానికి చేరుకుని సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన పదవీ బాధ్యతలను అలీ స్వీకరిస్తారని సంబంధిత వర్గాల సమాచారం.
mahamood ali
home minister
Telangana

More Telugu News