varalakshmi: శింబు .. విశాల్ గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • విభిన్నమైన పాత్రలపట్ల ఉత్సాహం 
  • ఈ ఏడాది క్రేజ్ పెంచిన పాత్రలు 
  • ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలేదు           
తమిళంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కి మంచి క్రేజ్ వుంది. కేవలం కథానాయికగా మాత్రమే కాకుండా విభిన్నమైన .. కీలకమైన పాత్రలను చేయడానికి ఆమె ఆసక్తిని చూపుతోంది. అలా ఆమె చేసిన 'పందెం కోడి 2' .. 'సర్కార్' .. ' మారి 2' సినిమాల్లోని పాత్రలు ఆమె క్రేజ్ ను మరింత పెంచాయి. తెలుగు ప్రేక్షకులకు ఆమెను చేరువ చేశాయి. అలాంటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ అవార్డుల వేడుకలో పాల్గొనగా, ఆమె పైకి యాంకర్ కొన్ని సరదా ప్రశ్నలు సంధించింది.

 ముద్దు ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారు? అనే ప్రశ్నకి సమాధానంగా ఆమె 'శింబు' పేరు చెప్పింది. చంపాలనిపించేంత కోపం వస్తే ఎవరిని టార్గెట్ చేస్తారు? అనే ప్రశ్నకి నవ్వుతూ 'విశాల్'ను టార్గెట్ చేస్తానని అంది. ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అనే ప్రశ్నకి సరదాగానే స్పందిస్తూ 'ఈ ఇద్దరినీ కాకుండా మరెవరినైనా' అని చెప్పింది. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలేదనీ .. కెరియర్ పైనే పూర్తి దృష్టిపెట్టాననీ .. చేతిలో వున్న సినిమాలు పూర్తి చేయాలని చెప్పుకొచ్చింది. 
varalakshmi
simbu
vishal

More Telugu News