rafel: రాఫెల్ కుంభకోణం ఎంత పెద్ద దేశ ద్రోహం!: నటి మాధవీ లత

  • మేక్ ఇన్ ఇండియా ఎవరికి కావాలి?
  • మాకు విదేశీ బ్రాండ్ అంటే ఇష్టం
  • మోదీపై మాధవీ లత సెటైర్లు 
తాను బీజేపీలో చేరిందే నరేంద్ర మోదీ నిజస్వరూపం గురించి తెలుసుకునేందుకేనని, ఆయన దుర్మార్గుడని తేలిపోయిందంటూ హీరోయిన్ మాధవి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మరో పోస్ట్ లో మోదీపై విరుచుకుపడింది. రాఫెల్ కుంభకోణం ఎంత పెద్ద దేశ ద్రోహం ఇది? అని ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా ఎవరికి కావాలి? మాకు విదేశీ బ్రాండ్ అంటే ఇష్టమంటూ మోదీపై సెటైర్లు విసిరారు. యుద్ధవిమానాల ధరలను ఫ్రాన్స్ ప్రతి ఏడాది పెంచితే ఇచ్చేస్తారా? ఎలా ఇస్తారు? అంటూ ప్రశ్నలు వర్షం కురిపించారు. ఈ సందర్భంగా రిలయన్స్ సంస్థ, స్వచ్ఛభారత్ పై ఆమె విమర్శలు చేశారు.

rafel
modi
bjp
make in india
madhavi latha

More Telugu News