Kadapa District: మతి స్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్.. కేసు నమోదుకు నిరాకరిస్తున్న పోలీసులు!

  • కడప జిల్లా రైల్వేకోడూరులో దారుణం
  • గర్భం దాల్చిన బాధితురాలు
  • పోలీసులను ఆశ్రయించిన కుటుంబసభ్యులు
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో మృగాళ్లు రెచ్చిపోయారు. మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. దీంతో సదరు యువతి గర్భం దాల్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కేసు నమోదు చేసేందుకు పోలీస్ అధికారులు నిరాకరించారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

జిల్లాలోని రైల్వేకోడూరు మండలం, శాంతినగర్ లో మతి స్థిమితం లేని యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో యువతిపై కన్నేసిన ముగ్గురు దుండగులు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి, గత కొంతకాలంగా లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో యువతి గర్భం దాల్చింది.

ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో తమకు పోలీసుల దగ్గర కూడా న్యాయం జరగలేదనీ, తాము ఇంకెవరి దగ్గరకు వెళ్లాలని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
Kadapa District
Andhra Pradesh
mentally ill
girl
gangrape
Police
reject
case
registered

More Telugu News