Asaduddin Owaisi: షా ఆలంఖాన్ మనవడు... ఇక అసదుద్దీన్ ఒవైసీ అల్లుడు!

  • దక్కన్ సిగరెట్స్ అధినేత నవాబ్ షా ఆలంఖాన్
  • ఆలంఖాన్ మనవడు బర్కత్ తో అసదుద్దీన్ కుమార్తె వివాహం
  • 28న వివాహానికి హాజరు కానున్న కేసీఆర్
దక్కన్ సిగరెట్స్ తో పాటు, అన్వర్ లూమ్ కాలేజీ వంటి విద్యాసంస్థలను నిర్వహిస్తున్న నవాబ్ షా ఆలంఖాన్ కుటుంబంతో అసదుద్దీన్ ఒవైసీ బంధుత్వాన్ని కలుపుకోనున్నారు. అసదుద్దీన్ కుమార్తె ఖుదాసియాకు, ఆలంఖాన్ మనవడు బర్కత్ ఆలంఖాన్ కు మధ్య నిశ్చితార్థం వైభవంగా జరుగగా, ఈ నెల 28న వివాహం జరుగనుంది. ఒకరు పారిశ్రామికవేత్త కాగా, మరొకరు రాజకీయ నాయకుడు కావడంతో ఈ రెండు కుటుంబాల మధ్యా వియ్యం హైదరాబాద్ లో చర్చనీయాంశమైంది. కాగా, అసదుద్దీన్ తో పాటు, ఆలంఖాన్, బర్కత్ లు తమ వివాహ శుభలేఖను తీసుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ వద్దకు వచ్చి తమ ఇంట జరిగే శుభకార్యానికి రావాలని ఆహ్వానం అందించగా, కేసీఆర్ అందుకు అంగీకరించారు కూడా.
Asaduddin Owaisi
KCR
Alamkhan
Khudasia
Barkat
Marriage

More Telugu News