Jagan: నన్ను విమర్శించే హక్కు నీకుందా?: చంద్రబాబుపై జగన్ ఫైర్

  • ప్రజలు మీ దృష్టిలో అమాయకులా?
  • హోదాను వద్దని ఉంటే అదే పార్టీతో ఎందుకు మంతనాలు 
  • ఫేస్ బుక్ లో జగన్ ప్రశ్నాస్త్రాలు
"టీఆర్ఎస్ తో పొత్తుకు వెంపర్లాడిన మీకు మమ్మల్ని విమర్శించే హక్కుందా?" అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టిన ఆయన, "చంద్రబాబు గారూ... ప్రజలు మీ దృష్టిలో అమాయకులా? లేదా ఎల్లో మీడియా ఉందన్న ధైర్యమా? టీఆర్ఎస్ తో పొత్తుకు ఎందుకు వెంపర్లాడావు? హోదాను వద్దని ఉంటే అదే పార్టీతో ఎందుకు మంతనాలు జరిపావు? హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా పొత్తు పెట్టుకుందామని కేటీఆర్ ను ఎలా అడిగావు? ఊసరవెల్లి కన్నా వేగంగా రంగులు మార్చి మమ్మల్ని విమర్శిస్తావా?" అని జగన్ ప్రశ్నలు సంధించారు.
Jagan
Chandrababu
Facebook
TRS

More Telugu News